- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్
దిశ, మెదక్: సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని.. చేతల్లో మాత్రం అంతా శూన్యమేనని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కోహేడ మండలం బస్వపూర్‌లో ఆయన పర్యటించి.. కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో క్వింటా ధాన్యానికి రూ. 2500 ఇస్తుంటే.. తెలంగాణలో మాత్రం రూ.1835 ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తాలు పేరిట మిల్లర్లు కోత విధిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా.. మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు పలు చోట్ల ధాన్యం తడిసిపోతుందని.. కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు నష్టం వస్తే ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామాలను, ఇండ్లను బలవంతంగా ఖాళీ చేయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సిద్ధిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండానే పోలీసులతో బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించడం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు.
tag: Uttam Kumar Reddy, comments, CM kcr, siddipet