జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి: ఉత్తమ్ కుమార్‌రెడ్డి

by Shyam |
జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
X

దిశ, న్యూస్ బ్యూరో: జనతా కర్ఫ్యూలో అందరు పాల్గొనాలని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వేగంగా కరోనా విస్తరిస్తుందన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారితో ఇది ఎక్కువగా వస్తుందన్నారు. దీనికి చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు. స్వీయ ఐసోలేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆదివారం ఉదయం నుంచి 24 గంటల పాటు అందరూ జనతా కర్ఫ్యూలో పాల్లొనాలిని పిలుపునిచ్చారు. ఎవరు బయటకు రాకుండా ఉంటే కొంత వరకు అరికట్టేందుకు అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని గుర్తు చేశారు. పేదలు, దినసరి కూలీలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. వివిధ ఫైనాన్స్ సంస్థలకి చిరు ఉద్యోగులు వాయిదాలు చెల్లించే వారికి వెసులుబాటు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రజలకు సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు.

tag: tpcc uttam kumar reddy, comments, janatha curfew, gandhi bhavan

Advertisement

Next Story