- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ 95 మాస్కులు శానిటైజ్ ఎలా చేయాలో తెలుసా?
సాధారణంగా గుడ్డతో చేసిన మాస్కులను సబ్బు, డిటర్జెంట్‌తో ఉతుకుతున్నారు. కానీ, ఎన్ 95 మాస్కుల విషయానికి వచ్చే సరికి అలా సాధ్యం కావడం లేదు. వాటిని ఎలా శానిటైజ్ చేయాలో తెలియక అందరూ ఇబ్బందిపడుతున్నారు. అందుకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌తో ఇప్పటివరకు అన్నం వండుకున్నాం, పప్పు ఉడకబెట్టుకున్నాం. అయితే, ఇప్పుడు దానితో ఒక కొత్త ఉపయోగాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అవును.. మీరు చదివింది నిజమేనండీ..మాస్క్‌లను శానిటైజ్ చేయడానికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉపయోగించొచ్చని ఓ అధ్యయనంలో తేలింది.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో లేదా ఏదైనా మట్టి కుండలో 50 నిమిషాల పాటు ఎన్ 95 మాస్క్‌ను డ్రై హీట్ చేయడం చేయడం ద్వారా శానిటైజ్ చేయొచ్చని ఇల్లినోయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా ఎన్95 మాస్కుల సరఫరా తక్కువ ఉండటంతో వాటిని తిరిగి ఎలా ఉపయోగించుకోగలగాలనే విషయం గురించి వీరు అధ్యయనం చేశారు. అందుకు డ్రై హీట్ చేస్తే సరిపోతుందని తేల్చిచెప్పారు. ఎన్95 మాస్కులను ఉతకడం, కడగడం, శానిటైజర్ రుద్దడం ద్వారా వాటి ఫిల్టరేషన్ సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే ఆ మాస్కులను ముట్టుకోకుండా శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రైస్ కుక్కర్ ద్వారా డ్రై హీట్ చేయడం వల్ల డీకంటామినేషన్, ఫిల్టరేషన్, ఫిట్టింగ్ వంటి విషయాల్లో ఎలాంటి లోటు ఉండదని వీరి అధ్యయనంలో తేలింది. డ్రై హీట్ ద్వారా ఎలక్ట్రిక్ కుక్కర్‌లో విడుదలయ్యే రేడియేషన్ వల్ల మాస్కులో చేరిన వైరస్‌లు, దుమ్ము ధూళి వదిలి పోతాయని లీడ్ సైంటిస్ట్ విశాల్ వర్మ తెలిపారు.