తొమ్మిది కిలోల డ్రెస్ ధరించిన హీరోయిన్..

by Jakkula Samataha |
తొమ్మిది కిలోల డ్రెస్ ధరించిన హీరోయిన్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం సూపర్ హెవీ ఔట్‌ఫిట్ ధరించిన భామ.. ఫ్యాషన్ కోసం ఏం చేసేందుకైనా సిద్ధమేనంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. మైసన్ మెట్ ఫ్యాషన్ బ్రాండ్‌ డిజైన్ చేసిన తొమ్మిది కిలోల డ్రెస్ ధరించిన హీరోయిన్.. ఇందుకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాషన్ కోసం ఇంత కష్టపడుతున్న తను మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. కాగా రెండుసార్లు మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఊర్వశి.. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘బ్లాక్ రోజ్’ సినిమా ద్వారా తెలుగు తెరకు కూడా పరిచయం కాబోతున్న భామ.. త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతోంది.

Advertisement

Next Story