పంటల ఆధారంగా యూరియా సరఫరా చేయాలి : మంత్రి

by Shyam |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పంటల ప్రణాళికల ఆధారంగా యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇఫ్కో ప్రతినిధులను కోరారు. గురువారం మంత్రుల నివాస సముదాయంలో యూరియా సరఫరా అంశంపై ఇఫ్కో ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇఫ్కో సమావేశంలో చర్చించి పరిశీలనలు చేపట్టాలని కోరారు.

దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తే దక్షిణ భారతదేశం మొత్తానికి సరఫరాకు అనువుగా ఉంటుందని సూచించారు. రాష్ట్రంలో సాగునీరు, 24గంటల విద్యుత్ అందుబాటులో ఉన్నందున సాగు విస్తీర్ణం పెరిగి అధిక దిగుబడులు వస్తున్నాయని వివరించారు. రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో యూరియాను అందించేందుకు తగిన ఏర్పాట్లను చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, జీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ హాజరయ్యారు.

Advertisement

Next Story