- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినియోగదారుల రక్షణ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
దిశ, హైదరాబాద్ బ్యూరో : వినియోగదారుల రక్షణ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వినియోగదారుల రక్షణ చట్టం 1986 డిసెంబర్ 24న అమల్లోకి వచ్చిందని అలాగే వినియోగుదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి వినియోగదారుల ఫోరమ్ చక్కగా పనిచేస్తున్నాయని అన్నారు. డిజిటల్ విధానం, వర్చువల్ విచారణాల ద్వారా వినియోగదారులకు సత్వర న్యాయం అందేలా సంఘాలు పనిచేయాలని సూచించారు. వినియోగదారులు ఆహార పదార్థాలు, నగలు, ఇతర ఏ వస్తువైన కొనుగోలు చేసేటప్పుడు ధర, నాణ్యత ప్రమాణాలు తెలుసుకొని కొనుగోలు చేయాలని అన్నారు.
ఎక్కడైనా అన్యాయం జరిగితే సత్వరమే వినియోగదారుల ఫోరమ్ లో అర్జీ దాఖలు చేసి న్యాయ పరంగా నష్టపరిహారం పొందాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల హక్కులు, చట్టాలపై అన్ని వినియోగదారుల సంఘాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని అభినందించారు. అలాగే ప్రజలతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులలో కూడా వినియోగదారుల చట్టాలపై చైతన్యం కల్పించాలని అన్నారు. ముఖ్యంగా ఆహార విషయంలో శాఖాధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టలని అన్నారు. వినియోగదారులు ఎక్కడ కూడా నష్టపోకుండా నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయాలని, నకిలీ వస్తువుల మోసాల నుండి బయటపాడాలంటే వినియోగదారులలో చైతన్యం అవసరమని అన్నారు.
వినియోగదారుల సంఘాల సూచనలు, సలహాలు తప్పక పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. అనంతరం వినియోగదారుల చట్టాలపై ఉపన్యాసం ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందచేసి అభినందించారు. అంతకుముందు తూనికల కొలతల శాఖ ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్తువుల స్టాల్ లను సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిసిఎస్ఓ రమేష్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అరుణ్ సాయి, తునికలు, కొలతల అధికారి శివానంద్, ఆరోరా కళాశాల ప్రొఫెసర్ అర్జున్ రావు, వివిధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.