BR Naidu: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. టీటీడీ చైర్మన్ కీలక నిర్ణయాలు

by Ramesh Goud |   ( Updated:2024-12-24 16:55:19.0  )
BR Naidu: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. టీటీడీ చైర్మన్ కీలక నిర్ణయాలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ‌వారి భ‌క్తుల‌కు మ‌రింత నాణ్య‌మైన సేవ‌లు అందించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) అన్నారు. మంగ‌ళ‌వారం తిరుమ‌ల(Thirumala) అన్న‌మ‌య్య భ‌వ‌నంలో(Annamaiah building) టీటీడీ చైర్మన్ అధ్యక్షతన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు(TTD EO J Shyamala Rao) సహా ఇతర ఉన్నతాధికారులు హజరయ్యారు. ఈ సమావేశంలో దర్మకర్తల మండలి ఆధ్వర్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(CM Chandrababu) ఆదేశాల మేర‌కు టీటీడీ ఆల‌యాలు(TTD Tempes), ఆస్తుల GLOBAL EXPANSION కోసం నిపుణుల‌తో క‌మిటీ(Committee) ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే ముఖ్యమంత్రి సూచనల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు.

స్విమ్స్ ఆసుపత్రికి(Swims Hospital) జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు, న‌ర్సులు, పారా మెడిక‌ల్ సిబ్బంది, అత్యధిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. భక్తులకు మ‌రింత‌ మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్(Feed Back Management) సిస్టం ఏర్పాటు చేయాల‌ని, ఏపీ డిజిటల్ కార్పోరేషన్(AP Digital Corporation) సహకారంతో భ‌క్తుల‌ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. తిరుమలలోని బిగ్, జనతా క్యాంటిన్ ల నిర్వహణ సరిగ్గా లేదని, మ‌రింత నాణ్యంగా ఆహార ప‌దార్థాలు త‌యారు చేసే అందించేందుకు దేశంలో ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమ‌లు చేయాలని సభ్యులు తెలిపారు. తిరుమల అన్న ప్రసాద విభాగంలో SLSMPC ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు మండలి ఆమోదం తెలిపింది.

కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుండి ప్రతి సంవత్సరం రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. తిరుమలలో ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సెఫ్టి విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీస‌ర్‌ పోస్టును SLSMPC కార్పొరేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి దర్శనానికి సర్వ దర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భ‌వ‌నాల నుండి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో రూ.3.36 కోట్ల‌తో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణం, ఒంటి మిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43 ల‌క్ష‌ల‌తో బంగారు కలశం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇక ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థానిక సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణ‌యించిన రూ.20కోట్ల‌కు పైగా ఉన్న‌ లీజు ధరను తగ్గించేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాల‌ని దర్మకర్తల మండలి సభ్యులు నిర్ణ‌యించారు.

Also Read...

Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్

Advertisement

Next Story

Most Viewed