వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ పట్ల ఉద్యోగుల హర్షం

by Bhoopathi Nagaiah |
వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ పట్ల ఉద్యోగుల హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించడం పట్ల ట్రెసా, వీఆర్వో జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ ద్వారా రైతుల సమస్యల పరిష్కారం ఈజీ అవుతుందన్నారు. దాంతో పాటు పూర్వపు వీఆర్వోలు ఆత్మగౌరవంతో బతకడానికి, పోయిన విలువలను కాపాడడానికి తీసుకున్న నిర్ణయం పట్ల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మంత్రిని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, వీఆర్వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ లు కలిసి ధన్యవాదాలు తెలిపారు. గత సర్వీసు, ప్రమోషన్లు, జాబ్ చార్ట్ సమస్యల గురించి వివరించారు. గత సర్వీసును పరిగణనలోకి తీసుకొని కామన్ సీనియారిటీని ఫిక్స్ చేయాలని, అర్హులైన వారందరికీ ప్రమోషన్లు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థతో రాష్ట్ర అభివృద్ధి తధ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఎంపీ బలరాం నాయక్, వీఆర్వో జేఏసీ సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేష్, వైస్ చైర్మన్ ఎస్కే మౌలానా, చింతల మురళి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed