భారత్ బ్రాండ్ స్కీమ్ వాహనాలు ప్రారంభం

by Sridhar Babu |
భారత్ బ్రాండ్ స్కీమ్ వాహనాలు ప్రారంభం
X

దిశ, కొత్తపల్లి : కేంద్ర ప్రభుత్వం, నాఫెడ్ ఆధ్వర్యంలో భారత్ బ్రాండ్ స్కీమ్ పేరిట ప్రవేశపెట్టిన నిత్యావసర వస్తువుల వాహనాలను మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నాఫెడ్ స్టేట్ డిప్యూటీ మేనేజర్ పట్నాయక్, నైవేధ్యం ఫుడ్స్ నిర్వాహకులు బోనగిరి సంతోష్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

భారత్ ప్రొడక్ట్ స్కీమ్ లో 30 రూపాయలకే కిలో గోధుమపిండి, 70 రూపాయలకే కిలో శనగ పప్పు, 34 రూపాయలకి కిలో బియ్యం సబ్సీడీతో ఇంటి వద్దకే వ్యాన్లలో చేరవేయనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని తెలంగాణలో శ్రీ నైవేద్యం ఫుడ్స్ వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని, వీటిని కొనుగోలు చేయటానికి ప్రజలు వారి పేరు, ఫోన్ నంబర్ ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed