- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరి 1 నుంచి యాసంగి పంటలకు నీరు
దిశ, సైదాపూర్ : యాసంగి పంటల సాగుకు జనవరి 1 నుంచి సాగునీరు విడుదల చేస్తామని, ఎల్‌ఎండీ నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా రోజుకు 4000 క్యూసెక్కుల చొప్పున నీటిని మార్చి 31 వరకు ఆన్ ఆఫ్ పద్ధతిలో సరఫరా చేస్తామని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా యాసంగి (రబీ) 2024-25 కోసం ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 కింద మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, హుజురాబాద్ తో పాటు ఇతర దిగువన ఉన్న ప్రాంతాల కోసం, 6,97,708 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు కోసం మొత్తం 44.480 టీఎంసీల నీటి కేటాయించినట్టు తెలిపారు.
లోయర్ మానేర్ డ్యామ్ లో 13 టీఎంసీలు, మిడ్ మానేరు రిజర్వాయర్ లో 11 టీఎంసీలు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి అదనంగా 5 టీఎంసీలు దీంతో మొత్తం అందుబాటులో ఉన్న నీరు 29 టీఎంసీలకు చేరుకోగా దాదాపు 15 టీఎంసీల లోటు మిగిలిందన్నారు. ఈ కొరతను పరిష్కరించడానికి ఎల్‌ఎండీ నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా రోజుకు 4000 క్యూసెక్కుల డిశ్చార్జి చొప్పున నీటిని విడుదల చేస్తారని తెలిపారు. సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ఏఏ ప్రాజెక్టుల ద్వారా ఎన్ని నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై సమాచారం తీసుకున్నట్టు తెలిపారు. 90 రోజుల పాటు ఆన్అండ్ ఆఫ్ సిస్టమ్ ద్వారా నీటి సరఫరా ఉంటుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే విత్తనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ జిల్లాల్లో పర్యటించిందన్నారు. జనవరి 30న జరిగే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు జరిగిందని, కుటుంబ నిర్ధారణ అయిన వారికి కూడా రుణమాఫీ జరిగిందని, మార్చి వరకు 2 లక్షలపైన ఉన్నవారికి పై డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, వెన్కెపల్లి సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, బొమ్మగాని రాజు, గోపగోని నవీన్ కుమార్, గొల్లపెల్లి యాదగిరి, వెల్ది రాజు, పెద్ది తిరుపతి, బైరి రాజు, మేకల రవీందర్, ఉడిగే రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.