Himachalpradesh: హిమాచల్‌ను కమ్మేసిన మంచు.. 177 రోడ్లు మూసివేత

by S Gopi |
Himachalpradesh: హిమాచల్‌ను కమ్మేసిన మంచు.. 177 రోడ్లు మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. హిమపాతం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక రహదారులను అక్కడి ప్రభుత్వం మూసేసింది. తాజాగా పలు జిల్లాల్లోని పెద్ద ఎత్తున హిమపాతం కురవడంతో మూడు జాతీయ రహదారులతో సహా కనీసం 177 రహదారులను మూసేసినట్టు అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా క్రిస్‌మస్ సందర్భంగా పర్యాటకుల తాకిడి పెరగడంతో వందలాది వాహనాలు చిక్కుకుపోయాయి. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం కినౌర్, లాహౌల్, స్పితి, సింలా, కులు, మండి, చంబా, సిర్మౌర్ జిల్లాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం అత్యధికంగా నమోదైంది. క్రిస్మస్ సందర్భంగా వరుసగా రెండోరోజు హిమపాతం పడటంతో పర్యాటకుల రాక ఊపందుకుంది. సింలాలో హోటల్ ఆక్యుపెన్సీ 70 శాతానికి పైగా ఉందని సింలా హోటల్ అండ్ టూరిజం స్టేక్‌హోల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకె సేథ్ చెప్పారు. హిమపాతం కారణంగా హోటల్ల్లో రూముల బుకింగ్‌లు 30 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 174 రోడ్లు, మూడు నేషనల్ హైవేలను మూసేసినట్టు అదనపు ముఖ్య కార్యదర్శి ఓంకర్ శర్మ స్పష్టం చేశారు. అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్న సుమారు 500 వాహనాల్లోని పర్యాటకులను సురక్షితంగా రక్షించామని ఆయన పేర్కొన్నారు. పలు నివేదికల ప్రకారం, గత 24 గంటల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో నలుగురు మరణించారు. కొన్ని చోట్ల వాహనాలు స్కిడ్ అవడంతో అనేకమంది గాయపడ్డారు. బాధితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed