Minister Ponguleti: కేంద్రం రిజెక్ట్ చేసినా.. ఆ డబ్బులు మేమిస్తాం.. మంత్రి పొంగులేటి

by Ramesh N |
Minister Ponguleti: కేంద్రం రిజెక్ట్ చేసినా.. ఆ డబ్బులు మేమిస్తాం.. మంత్రి పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనవరి 4 లేదా 5 తేదీ వరకు 80 లక్షల మంది దరఖాస్తు దారుల డేటా రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుందని, ఇండ్ల నిర్మాణానికి అర్హులకు కేంద్రం నిధులు రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. ఇండియాలో ఏ రాష్ట్రంలో కట్టనన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ కట్టబోతున్నామని చెప్పారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma houses) పై మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత నిరుపేదలకే ప్రాధాన్యత ఇచ్చే ఈ పథకం అమలులో భాగంగా ఈ రోజు 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేడర్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇండ్లు రాబోయే కొద్దిరోజుల్లో ఇస్తామన్నారు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి కావలసిన యంత్రాంగాన్ని, టెక్నాలజీని వాడబోతున్నట్లు తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇబ్బందులు, సమస్యలు ఉంటే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చని స్పష్టం చేశారు. మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఎవరైనా కంప్లయింట్, సూచనలు ఇవ్వాలంటే యాప్, వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబర్‌లో ఇవ్వొచ్చని.. వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు.

ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఇండ్ల నిర్మాణం

ఇందిరమ్మ ఇండ్లపై తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే.. మిస్‌యూజ్ అవుతుందని, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చూస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజా పాలనలో ఇల్లు కావాలని టిక్ పెట్టిన వారు 80 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేశారు. అర్హులను గుర్తించి ప్రలోభాలు లేకుండా ఇండ్లు ఇస్తామన్నారు. 4 లక్షల ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకోమని, భవిష్యత్‌లో మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed