ఉపాసన తల్లి అడ్వెంచర్..సైకిల్‌పైనే హైదరాబాద్ నుంచి చెన్నైకి

by Shyam |
ఉపాసన తల్లి అడ్వెంచర్..సైకిల్‌పైనే హైదరాబాద్ నుంచి చెన్నైకి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉపాసన కామినేని కొణిదెల ఫేస్ బుక్‌లో సూపర్ ఇన్స్‌పిరేషనల్ పోస్ట్ పెట్టింది. 60 ఏళ్ల వయసున్న తన తల్లి శోభనా కామినేని, తనకు తానుగా చాలెంజ్ తీసుకుని.. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు సైకిల్‌పై వెళ్లాలని నిర్ణయించుకుందని తెలిపింది.భారతదేశాన్ని అన్వేషించడం అంటే ఇదేనన్న ఉపాసన.. ఇదొక అడ్వెంచర్ వెకేషన్‌గా అభివర్ణించింది.

ఈ ఫీట్, తన అపోలో ఫార్మసీ ఫ్యామిలీ మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుందని.. తన పిల్లలు కూడా ఫాలో కావాలని ఓ అడ్వెంచర్‌ను సెట్ చేసిందని తెలిపింది. ఈ టైంలో తను కూడా అమ్మతో ఉంటే బాగుండేదన్న ఉపాసన.. గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. ఈ ట్రిప్ సాధ్యమయ్యేలా చేసిన డాడీకి స్పెషల్ థాంక్స్ చెప్పింది.

Advertisement

Next Story