భర్తకు కరోనా.. ట్రీట్మెంట్ చేయమన్న భార్యను ఏం చేశారో తెలుసా..!

by Anukaran |   ( Updated:2021-05-11 00:30:16.0  )
భర్తకు కరోనా.. ట్రీట్మెంట్ చేయమన్న భార్యను ఏం చేశారో తెలుసా..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తున్న వేళ అండగా నిలవాల్సిన వైద్యులు పలు హాస్పిటల్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పేషెంట్లకు చికిత్స చేసే విషయంలో అశ్రద్ధ చూపడంతో పలువురి ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన బీహార్‌లో సంచలనం రేపుతోంది. ఓ ఆస్పత్రిలో పేషెంట్‌ బాగోగులు చూడమంటే సిబ్బంది తనపై లైంగిక దాడి చేశారని.. వైద్యులు భర్త మృతికి కారణమయ్యారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాధితురాలు తెలిపిన వివరాలు..

యూపీలోని నోయిడాలో స్థిరపడ్డ దంపతులు.. ఇటీవల హోళీ పండుగ సందర్భంగా స్వస్థలమైన బీహార్‌కు వచ్చారు. ఇదే క్రమంలో తన భర్తకు ఏప్రిల్ 9న కరోనా రావడంతో భాగల్పూర్ నగరంలోని గ్లోకల్ ఆస్పత్రిలో చేర్చింది. క్రమంగా పేషెంట్ పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో రెమిడెసివిర్ కూడా తెప్పించారు. కానీ, ఇంజెక్షన్ వినియోగించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారని ఆమె ఆరోపించింది. దీనికి తోడు ఆస్పత్రిలో అటెండర్లు దారుణంగా ప్రవర్తించారని.. తన భర్త మంచి నీళ్లు అడిగినా ఇవ్వకుండా నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేసింది.

బెడ్‌ షీట్ మీద దుప్పట మార్చామంటే గ్లోకల్ ఆస్పత్రి అటెండర్ జ్యోతి కుమార్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది. దుప్పటి మార్చమంటే నడుము మీద చేయి వేసి ఇబ్బంది పెట్టాడని కన్నీరు పెట్టుకుంది. ఈ వ్యవహారం కాస్తా బయటకు రావడంతో ప్రభుత్వం అధికారుల విచారణ తర్వాత అతడిని తొలగించారు. కానీ, ఆ తర్వాత తన భర్తను తదుపరి చికిత్స కోసం భాగల్పూర్‌లోని మాయగంజ్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ కూడా ఇటువంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయని బాధితురాలు వాపోయింది. మాయగంజ్ ఆస్పత్రిలో నైట్ షిఫ్టూలో ఉన్న వైద్యులు ఆక్సిజన్ అందించమంటే నిరాకరించారని చెప్పుకొచ్చింది. ఇక లాభం లేదనుకొని పాట్నా నగరంలోని రాజేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స అందించేటప్పటికీ తన భర్త ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోయినా.. బ్లాక్‌లో సిలిండర్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని తన బాధను చెప్పుకొచ్చింది. ఇలా మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా చివరకు భర్త ప్రాణాలను కాపాడుకోలేకపోయానని బాధితురాలు పెట్టిన వీడియో అందరి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed