హథ్రాస్ కేసు వేళ డీజీపీ భార్య సూసైడ్

by Shamantha N |
హథ్రాస్ కేసు వేళ డీజీపీ భార్య సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హథ్రాస్ హత్యాచారం కేసులో విచారణ జరుగుతున్న ఈ సమయంలో విషాద పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు పై దర్యాప్తు చేయాల్సిందిగా యోగి సర్కార్ సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, సిట్ డీజీపీగా చంద్రప్రకాశ్ వ్యవహరిస్తున్న సమయంలో ఆకస్మాతుగా ఆయన భార్య ఉరి వేసుకుంది. కోడలు సీలింగ్ ఫ్యాన్‌కు హ్యాంగ్ అయి ఉండటం గమనించిన కుటుంబీకులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయినా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా.. ఎటువంటి సూసైడ్ లెటర్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story