- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ల్యాండ్ మేడ్ కాదు.. ఇకపై ల్యాబ్ మేడ్ ‘డైమండ్’
దిశ, ఫీచర్స్ : బంగారాంలాగే వజ్రాలు కూడా భూగర్భంలోనే సహజంగా తయారవుతాయన్నది తెలిసిందే. అయితే వజ్రం భూగర్భంలో తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడో వందల కోట్ల ఏళ్ల క్రితం తయారైన వజ్రాలనే ఇప్పటివరకు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గనుల్లోని వజ్రాలు అయిపోవడానికి రావడంతో ల్యాబ్‌లోనే డైమండ్‌ను తయారుచేయడం ప్రారంభించారు. వర్జీనియాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ హోవార్డ్ షెంగ్ అండ్ టీం.. సహజ వజ్రం లక్షణాలతో పోలిన కొత్తరకం డైమండ్‌ను సృష్టించారు.
హోవార్డ్ షెంగ్ అతడి సహచరులు ఆరు అల్ట్రా-హార్డ్ కార్బైడ్ అన్విల్స్ మధ్య బక్‌మిన్‌స్టర్‌ఫుల్లెరెన్ లేదా బకీబాల్స్ అని పిలిచే కర్బన అణువును చూర్ణం చేయడం ద్వారా కొత్త రకమైన పదార్థాన్ని సృష్టించారు. దాదాపు 30 గిగాపాస్కల్‌ల ఒత్తిడితో, 270 రెట్ల పీడనం, 1200 ° C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఈ బకీబాల్స్‌ను పారాక్రిస్టలైన్ డైమండ్స్‌గా మార్చారు. అయితే వజ్రాల్లో స్ఫటికారా, నిరాకార నిర్మాణాలు ఉంటే.. ఇది ఆ రెండింటికీ మధ్య స్థితిలో ఉందని తెలిపారు పరిశోధకులు. పారాక్రిస్టలైన్ వజ్రాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద సహజ వజ్రాల వలె గట్టిగా ఉంటాయి. కాబట్టి వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువ కాలం పనిచేసే ఇతర పారిశ్రామిక ఉపకరణాలలోనూ ఉపయోగించవచ్చని షెంగ్ చెప్పారు.