ఎమ్మెల్యే రమేశ్ జర్మన్ పౌరుడే..

by Sridhar Babu |
ఎమ్మెల్యే రమేశ్ జర్మన్ పౌరుడే..
X

దిశ,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టు‌లో మరోసారి విచారణ జరిగింది. రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా వేములవాడ నియోజవర్గంలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ సందర్భంగా కోర్టులో రమేశ్ పౌరసత్వంపై వాదనలు జరిగాయి.

రోస్టర్ మారడంతో సంబంధిత బెంచ్ విచారణ జరుపుతుందని జస్టిస్ చల్లా కోదండరాం తెలిపారు. జర్మనీ పౌరసత్వం ఉన్న వ్యక్తి పదేళ్లు చట్టసభల్లో ఉండటాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించాలని కోర్టుకు పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా కేసును సంబంధిత బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసును వాయిదా వేసింది. రమేశ్ జ‌ర్మన్ పౌరుడేన‌ని కేంద్రం దృవీక‌రించడంతో పౌరసత్వం వివాదం వార్తల్లో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed