‘వైఎస్ షర్మిల మా ఇంటికి రావొద్దు.. మేము బాధలో ఉన్నాం’

by Anukaran |   ( Updated:2021-08-23 08:26:50.0  )
ys sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిలకు షాక్ తగిలింది. తెలంగాణలో నిరుద్యోగులకు అండగా నిలిచి వారిలో భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను షర్మిల చేపడుతున్నారు. అయితే రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లామంచిర్యాల నియోజకవర్గం డండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో నిరుద్యోగ అమరుడు భూక్య నరేశ్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి దీక్ష చేపట్టాలని భావించారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు షర్మిలను తమ ఇంటికి రావొద్దని షాక్ ఇచ్చారు. తామంతా తమ కుమారుడు మరణించిన బాధలో ఉన్నామని బాధితుడి తండ్రి శంకర్ నాయక్ లోటస్ పాండ్ వర్గీయులకు చెప్పినట్లుగా సమాచారం. ఈ విషయంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలను ఆరా తీయగా నరేశ్ నాయక్ కుటుంబీకుల్లో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలున్నాయని, భవిష్యత్ లో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశముందనే రావొద్దని సూచించినట్లుగా తెలిపారు. అయితే తాము మాత్రం దీక్షను చేపడుతామని లోటస్ పాండ్ శ్రేణులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story