హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్..

by Sridhar Babu |
Jammikunta
X

దిశ, జమ్మికుంట: ఈటల రాజేందర్ కు అనుకూలంగా వీణవంక మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. మండలంలోని 8 గ్రామాల కేడర్ ఈటలను అనుకూలంగా నినాదాలిస్తూ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారుమల్ల కొమురయ్య, వైస్ ఎంపీపీ రాయశెట్టి లతా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోర స్వామిలతో పాటు 8 గ్రామాల టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుమారు 500 మంది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈటల వెంటే ఉంటామని ప్రకటించారు.

ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మారుమల్ల కొమురయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కక్షపూరితంగా మంత్రి పదవి నుండి తొలగించారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో తెలంగాణా వ్యాప్తంగా తిరిగి స్వరాష్ట్ర కల సాకారం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఈటల తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ప్రకటించారు.

TRS leaders resign

వీణవంక ఎంపీపీతో పాటు పలువురు ప్రజా ప్రతినిధిలు ఈటల ఫోటో పెట్టుకుని గెలిచారని, ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారని అన్నారు. దమ్ముంటే ఎంపీపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని, తాము ఈటల ఫోటోతో బరిలో నిలుస్తామని, ఎంపీపీ కేసీఆర్ ఫోటోతో పోటీ చేయాలన్నారు. అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజల్లో ఎవరికి అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు. ఈటల కారణంగా పదవులు అనుభవిస్తున్నవారు ఆయన్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story