- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరుగురు వెళితే.. నలుగురు మిగిలారు
దిశ, నల్లగొండ: ఆరుగురు యువకులు బట్టలు ఉతకడానికి కృష్ణా నదికి వెళ్లారు. ఇందులో ఇద్దరు నది లోపలికి దిగడంతో ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఒకరు శవమై తేలగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామ సమీపంలో ఉన్న కృష్ణా నదికి బట్టలు ఉతకడానికి ఆరుగురు యువకులు కలిసి వెళ్లారు. వీరిలో ఉప్పతల వేణుగోపాల్(18), తోట నరేందర్(12) నదిలోకి దిగడంతో గల్లంతయ్యారు. మిగిలిన యువకులు గ్రామస్తులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజఈతగాళ్ల సహాయంతో గాలించగా తోట నరేందర్ మృతదేహం లభించింది. వేణు గోపాల్ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. తోట నరేందర్‌ది వజినేపల్లి గ్రామం కాగా, వేణుగోపాల్ స్వస్థలం ఖమ్మం జిల్లా మణుగూరు. లాక్‌డౌన్ కారణంగా వజినేపల్లిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.