HMPV virus: చైనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

by Prasad Jukanti |   ( Updated:2025-01-05 12:47:54.0  )
HMPV virus: చైనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) (HMPV virus) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు మరోసారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నాయి. చైనా మనకు పొరుగునే ఉన్నందున మన దేశంలోనూ ఈ కొత్త వైరస్ వ్యాప్తిపై ఆందోళన పెరిగిపోతున్నది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ కొత్త వైరస్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలంగాణలో ఇప్పటి వరకు హెచ్‌ఎంపీవీ కేసులు ఏవీ నమోదు కాలేదని శనివారం పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ (Telangana Director of Public Health Family Welfare) డైరెక్టర్ డా.బి. రవీంద్ర నాయక్ వెల్లడించారు. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ నివేదికలకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య శాఖతో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 డిసెంబర్ లో శ్వాసకోస ఇన్ ఫెక్షన్ ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఏమీ లేదని ఆరోగ్యశాఖ నిర్ధారించింది. ఈ మేరకు మెటాప్‌న్యూమోవైరస్ వ్యాప్తి లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

చేయవల్సినవి:

-మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటిని ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కవర్ చేసుకోవాలి.

- సబ్బు లేదా శానిటైజర్ తో మీ చేతులను తరచుగా కడగాలి

- రద్దీగా ఉండే ప్రదేశాలను వెళ్లరాదు

-ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తులకు దూరం పాటించాలి

-మీకు జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి

-ఎక్కువగా నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి

-తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవాలి

చేయకూడనివి:

-కరచాలనం(షేక్ హ్యాండ్) చేయవద్దు

-ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఉపయోగించిన టిష్యూ పేపర్, కర్చీఫ్ లను ఇతరులు వాడరాదు

- కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తాకవద్దు

- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం

- వైద్యుని సంప్రదించకుండా సొంతంగా మందులు తీసుకోవద్దు

Advertisement

Next Story

Most Viewed