- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: నోటిఫికేషన్లు ఇవ్వకుండా అన్ని జాబ్‌లు ఎలా ఇచ్చారు?
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) తనకు ఆదర్శమని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.. మరి ఆంధ్రాలో చంద్రబాబు జాబ్ క్యాలెండర్(Job Calendar) రిలీజ్ చేశారు.. తెలంగాణలో ఏమైందని బీఆర్ఎస్(BRS) నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హైకోర్టు క్యాలెండర్(High Court Calendar) కూడా రిలీజ్ అయింది.. టీజీపీఎస్సీ క్యాలెండర్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదని విమర్శించారు. బిహార్ క్యాలెండర్‌లో పండుగలతో పాటు జాబ్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి.. కాంగ్రెస్(Congress) వాళ్లు రిలీజ్ చేసే జాబ్ క్యాలెండర్‌లో జాబ్‌ల ప్రస్తావనే ఉండదని ఎద్దేవా చేశారు. మళ్లీ సిగ్గు లేకుండా గొప్పలు చెబుతూ గవర్నమెంట్ సొమ్ము కోట్లు వెచ్చించి న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇస్తున్నారని మండిపడ్డారు. మీరు ఇచ్చింది ఇప్పటివరకు 12,000 ఉద్యోగాలు మాత్రమే.. కానీ 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
నోటిఫికేషన్లు ఇవ్వకుండా 50 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు చాయ్ తాగే టైంలో నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నారు.. ఇప్పుడేమో తానేం చేయలేను అంటున్నారని అన్నారు. నిరుద్యోగులు కోటి ఆశలతో ఒక ఎమ్మెల్సీని గెలిపిస్తే అధికారంలోకి రాగానే అన్యాయం చేశారని విమర్శించారు. వారు మాకు న్యాయం చేయండి అని వారు నిరసన తెలుపుతుంటే మహిళలు అని కూడా చూడకుండా చితకబాది జైల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు కోర్టుకు వెళితే వారిని ఓడించడానికి కోట్లు వెచ్చిస్తుందని మండిపడ్డారు. ఎవరి పని ఏంటో తెలియకుండా పరిపాలన చేస్తున్నాడని రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.