Fire Accident : భారీ అగ్ని ప్రమాదం.. 500 గొర్రెలు ఆహుతి

by M.Rajitha |
Fire Accident : భారీ అగ్ని ప్రమాదం.. 500 గొర్రెలు ఆహుతి
X

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్(Warangal) కోట ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం(Fire Accident)లో 500 గొర్రెలు(Sheep) అగ్నికి ఆహుతి అయ్యాయి. గురువారం రాత్రి వరంగల్ కోట సమీపంలోని మట్టికోట వద్ద ఒక గొర్రెల కొట్టంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 500 గొర్రెలు మరణించాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గొర్రెల యజమాని దుగ్గిరాల లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ ప్రమాదం గురించి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అయితే, మంటలు ఆర్పే సమయానికి గొర్రెలు చనిపోయినట్లు తెలిసింది. ఈ అగ్ని ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మంటలు పెట్టారా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన 500 గొర్రెల వల్ల సుమారు 30 లక్షల రూపాయల నష్టపోయినట్టు బాధితుడు కన్నీటి పర్యంతం అయ్యాడు.

Next Story

Most Viewed