ఒక్క రూపాయి కూడా ఖర్చొ పెట్టొద్దు.. కాళేశ్వరంపై ప్రొ. కోదండరామ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
ఒక్క రూపాయి కూడా ఖర్చొ పెట్టొద్దు.. కాళేశ్వరంపై ప్రొ. కోదండరామ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం మరమత్తులకు రాష్ర్ట ఖాజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడొద్దని, డ్యామ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్ వచ్చిన తరువాత సమీక్షిచాలని ఎమ్మెల్సీ కోదండరామ్ తెలిపారు. రిపోర్ట రాకముందు ఖర్చు చేసే ప్రతి రూపాయి బూడిదలో పోసినట్లేఅవుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టు వడ్డిలకు రూ.12వేల కోట్లు, విద్యుత్తు ఛార్జీలకు రూ.12వేల కోట్లు ఖర్చువుతున్నట్లు తెలిపారు. అరఏకరంలోపు ఉన్న సన్నకారు రైతలకు రైతు భరోసా ద్వారా సంవత్సరానికి రూ.6వేలు మాత్రమే వస్తాయాని , రైతు కూలీలకు ఇస్తామని తెలిపిన రూ.12వేలు వారికి కూడా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలన్నారు. కేంద్ర రాష్ర్టాలకు ఇచ్చే గ్రాంట్లతో పోలీస్తే తెలంగాణకు తక్కువ వస్తుందని వివరాలు వెల్లడించారు. ఎపీకి రూ.98వేల కోట్లు, గుజరాత్ కు రూ.72వేల కోట్లు బీహర్ కు రూ.1.67లక్ష కోట్లు, మధ్య ప్రదేశ్ కు రూ.1.53కోట్లు ఇస్తున్నరని తెలంగాణ మాత్రం రూ.35కోట్లు కేటాయించారని అన్నారు. ప్రతి బడ్జెట్ లో అంచానాలకు , వ్యయాలకు 20శాతం తేడా ఉంటుందని తెలిపారు. బడ్జెట్ అశాజనకంగా ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. విద్యాశాఖకు 4శాతం మాత్రమే కేటాయించారని ఇంకా కొంచేం కేటాయించాలని కోరారు.

Next Story

Most Viewed