దొంగతనం కేసులో నిందితుడికి జైలు

by Sridhar Babu |
దొంగతనం కేసులో నిందితుడికి జైలు
X

దిశ, జగిత్యాల టౌన్ : దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా కోనవల్లికి చెందిన గంగారం అనే వ్యక్తి ఆరోగ్యం బాగాలేక జగిత్యాలలోని ఓ హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చి తిరిగి అతని సొంత గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయం కాగా బస్సులు లేకపోవడంతో బస్టాండ్ లో నిద్రించగా అతని బ్యాగులో ఉన్న రూ.18,300 ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశారు.

ఈ విషయం గురించి జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు దొంగతనం చేసిన నిందితుడు కొమరం సత్తయ్య, భద్రకాళి గ్రామం మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించి అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం కోర్టులో నిందితుడు దొంగతనం చేసినట్లు ఒప్పుకోగా నిందితునికి 5 నెలల 10 రోజుల జైలు శిక్షతో పాటు 50 రూపాయల జరిమానా విధిస్తూ జేఎఫ్సీఎం జడ్జి జితేందర్ తీర్పునిచ్చారు.

Next Story