రష్మిక ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. సికందర్ నుంచి ట్రైలర్ లాంచ్ డేట్ వచ్చేసింది..

by Anjali |
రష్మిక ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. సికందర్ నుంచి ట్రైలర్ లాంచ్ డేట్ వచ్చేసింది..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సికందర్ (Sikander) మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 30 వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) అండ్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికులుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Bollywood star hero Salman Khan)హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి భం భం భోలే సాంగ్ విడుదల అయిన విషయం తెలిసిందే.

విడుదలైన కొద్ది క్షణాల్లోనే భారీగా రెస్పాన్స్ లభించింది. అయితే సికందర్ నుంచి మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సికందర్ పై ప్రేక్షకుల్లో మేకర్స్ భారీ హైప్ పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్ కూడా ముహూర్తం ఖరారు చేశారు దర్శక, నిర్మాతలు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఈ అప్డేట్ అందించగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సికందర్ నుంచి సెకండ్ ట్రైలర్ మార్చి 23 వ తేదీన విడుదల కానుందని రష్మిక పోస్ట్‌లో తెలిపింది.

Next Story

Most Viewed