- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
PSBs: 33 శాతం పెరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీల) షేర్‌హోల్డర్లకు భారీ మొత్తంలో డివిడెండ్‌ను చెల్లించాయి. గణాంకాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల డివిడెండ్ చెల్లింపులు 33 శాతం పెరిగి రూ. 27,830 కోట్లకు చేరుకున్నాయి. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల మెరుగైన పనితీరు, వృద్ధిని సూచిస్తుంది. ఈ మొత్తం చెల్లింపుల్లో ప్రభుత్వ వాటాగా దాదాపు 65 శాతం లేదా రూ. 18,013 కోట్లు ఖజానాకు ఇచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీఅలు షేర్‌హోల్డర్లకు రూ. 20,964 కోట్ల డివిడెండ్ ఇచ్చాయి. అలాగే, సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు రూ. 1.41 లక్షల కోట్లను దాటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 9 నెలల కాలంలో రూ. 1.29 లక్షల కోట్లను అధిగమించాయని గణాంకాలు తెలిపాయి. సెమీ-అర్బన్, గ్రాఈణ ప్రాంతాల్లో కస్టమర్లకు అందించే సేవల్లో మెరుగుదల, అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాల ద్వారా బ్యాంకు కార్యకలాపాలు, పనితీరు లాభదాయకంగా మారాయి. 2023-24లోనూ బ్యాంకులు ఆర్జించిన రూ. 1,41,203 కోట్లలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ మాత్రమే 40 శాతానికి సమానమైన లాభాలను నమోదు చేసింది. అధిక వృద్ధి పరంగా, ఢిల్లీకి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభాలు అత్యధికంగా 228 శాతం పెరిగి రూ. 8,245 కోట్లకు చేరాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం అధికంగా రూ. 13,649 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లను వెల్లడించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 6,318 కోట్లు(57 శాతం), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 4,055 కోట్లు(56 శాతం), చెన్నైకి చెందిన ఇండియన్ బ్యాంక్ రూ. 8,063 కోట్లు(53 శాతం) చేరాయి. 2017-18లో రూ. 85,390 కోట్ల రికార్డు నష్టాల నుంచి పీఎస్‌బీలు 2023-24లో రికార్డు లాభాలను మారడం విశేషం.