- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారీ మోసం.. పోలీసులమంటూ దారి దోపిడీ

దిశ, తిరుమలగిరి : పోలీస్ దుస్తులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనిఖీల పేరుతో రూ. 5 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన ఆదివారం బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అరుణ్ అనే వ్యక్తి నుండి ఈ డబ్బు కాజేశారు. ఈ ఘటన నగరంలో సంచలనం రేకెత్తించింది. సికింద్రాబాద్ లోని గ్లోబల్ అడ్సర్బెంట్ సంస్థలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ బెహరాకు ఆ సంస్థ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ బిక్రమ్ బెహెరా 5 లక్షల రూపాయలను అసిస్టెంట్ మేనేజర్ సత్య పాండాకు ఇవ్వమని పంపించాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఎంఎంఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులో వెళ్తున్న క్రమంలో తనిఖీల పేరుతో పోలీసుల వేషధారణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
వాహనాన్ని ఆపిన అనంతరం డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ అడిగారు. అదే విధంగా అతని వద్ద ఉన్న బ్యాగును కూడా తనిఖీ చేయగా అందులో 5 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించి వాటి పత్రాలు చూపించాలని, లేనిపక్షంలో మీ యజమానిని తీసుకొని పోలీస్ స్టేషన్ కు రావాలని డబ్బుల బ్యాగు తీసుకుని అతన్ని అక్కడి నుండి పంపించారు. దాంతో అనుమానం వచ్చి బాధితుడు సంస్థ మేనేజర్ కు సమాచారం అందించగా అరుణ్ కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లీ ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న బోయన్ పల్లి పోలీసులు వాళ్లు నకిలీ పోలీసులని తెలుసుకున్నారు. సంస్థ మేనేజర్ బిక్రం బెహెరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తుల గురించి బోయిన్ పల్లి పోలీసులు అన్ని కోణాలలో వివరాలు సేకరిస్తున్నారు.