- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలోనే తొలి ఏటీఎస్ సెంటర్ అక్కడే

దిశ, తిమ్మాపూర్ : విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన తో పాటు జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్క్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారి తిమ్మాపూర్ లో రూ.8 కోట్లతో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం 15 సంవత్సరాలు నిండిన వాహనదారులు తమ వాహనాన్ని స్క్రాప్ కింద ఇస్తే వారికి నూతన వాహన కొనుగోలులో రాయితీ ఇచ్చే అవకాశం ఉందన్నారు.
రవాణా శాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ జరుగుతుందని, దానిని పూర్థి స్థాయిలో వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. లక్షలాది మంది పోలీసులు ఉన్నా రోజుకు కనీసం 20 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోతున్నారని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లను పాఠశాలల్లో, రవాణా శాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొదటిసారి 100 శాతం ట్యాక్స్ మినహాయింపుతో ఈవీ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు.
రవాణా శాఖలను మరింత బలోపేతం చేసేందుకు 97 మంది ఏఎంవీఐలను నియమించి శిక్షణ ఇస్తున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక్కరిని రక్షించినా సంతృప్తి ఉంటుందని తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా ఉత్తమ సేవలు అందించిన జువ్వాడి చొక్కారావు పేరును పార్క్ కు పెట్టడం హర్షణీయం అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, మన ప్రాణాలను మనం కాపాడుకోవడం, మన ముందున్న తక్షణ కర్తవ్యం అన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డీటీసీ పురుషోత్తం, ఉమ్మడి జిల్లా రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.