- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో తక్కువ ధరకే ఇసుక.. మూడు చోట్ల అమ్మకాలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇసుక అక్రమ అమ్మకాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించామని తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌కుమార్ తెలిపారు. ఇసుక బజార్లలో టన్ను ఇసుకు రూ. 1600 నుంచి రూ. 1800 వరకు విక్రయిస్తారు. త్వరలో నగరంలో ఓఆర్ఆర్సమీపంలో మూడు ఇసుక బజార్లు ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే అబ్దులాపూర్‌మెట్, బౌరంపేట, వట్టి నాగుల పల్లిలో బజార్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇసుక 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని,బజార్ల ఏర్పాటుతో ఇసుకు టన్ను ధర రూ. 2200 నుంచి రూ. 1800 లకు తగ్గిందన్నారు. రాష్ట్రంలో రోజుకు లక్ష టన్నుల ఇసుక లభ్యత ఉందని, ప్రతి 15 రోజులకు ఇసుక కాంట్రాక్టర్లకు క్రమం తప్పకుండా చెల్లింపులు ఉంటాయన్నారు. రెవెన్యూ, పోలీసు,మైనింగ్అధికారులు అన్ని ఇసుకు రీచ్ లను మూడు షిప్ట్‌లో పర్యవేక్షిస్తారని,అక్రమ రవాణ, ఓవర్లోడింగ్పట్టుకోవడానికి అన్ని రీచ్‌లు, ఇసుక గని వద్ద నిఘా వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు, సీసీటీవి, వేబ్రిడ్జి, జీపీఎస్, విటీఎస్వంటి మార్చి 31 నాటికి ఇన్స్టాలేషన్పూర్తి అవుతుందన్నారు.
హైదరాబాద్నగరంతో పాటు జిల్లాలో క్రమంగా మరిన్ని కేంద్రాలు పెంచుతామని, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇసుకు కాంట్రాక్టర్లకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని రూ. 1000 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఐదేళ్ల పాటు డబ్బులు తీసుకోకుండా గుత్తేదార్ల సరఫరా చేశారంటే ఏవిధంగా ఇసుక దోపీడి జరిగిందో అర్ధమైతుందన్నారు. రీచ్‌ల వద్ద నిఘా వ్యవస్ధ లేకుండా, లోవర్లోడింగ్తో ప్రభుత్వ ఖజానా పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు చేతిలోకి వెళ్లిందన్నారు. 2025–26 సంవత్సరానికి రూ. 1000 నుంచి రూ. 1200 కోట్ల ఇసుక ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనిల్‌కుమార్ చెప్పారు.