‘నన్ను జైల్లో పెట్టినా.. ఎన్నికల్లో పోటీ చేస్తా’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-01-04 12:16:33.0  )
‘నన్ను జైల్లో పెట్టినా.. ఎన్నికల్లో పోటీ చేస్తా’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ తీరును విమర్శించిన వారి పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Govardhan Reddy) అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ(శనివారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పారు. వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకట శేషయ్య యాదవ్ పై ఓ మహిళ నుంచి తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారని ఆరోపించారు. దీని పై జిల్లా ఎస్పీ తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో వివరాలు సరిగా లేవని న్యాయమూర్తి పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

దీంతో మెటీరియల్ ఎవిడెన్స్ ఉందని చెబుతూ మళ్లీ ఆ రిమాండ్ రిపోర్ట్ ను మార్చి తీసుకెళ్లారని చెప్పారు. ఈ కేసు పై న్యాయ వ్యవస్థను పోలీసులు తప్ప దోవ పట్టించారని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. జిల్లా ఎస్.పి. విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి రాకుండానే నివేదిక ఇచ్చారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు భయపడరని తేల్చి చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరి చేస్తాం అన్నారు. సోమిరెడ్డి చేసిన అవినీతిని వెంకట శేషయ్య ప్రశ్నించారని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. నాపై వేదయపాలెం స్టేషన్ లో ఒక కేసు పెట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడను అన్నారు. 2029 లోపు నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినా.. అక్కడ నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తా అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed