వాళ్ల ఉద్యోగం తీసేస్తే.. నేను నీ ఉద్యోగం తీసేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి కి కేఏ పాల్ మాస్ వార్నింగ్

by Aamani |
వాళ్ల ఉద్యోగం తీసేస్తే.. నేను నీ ఉద్యోగం తీసేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి కి  కేఏ పాల్ మాస్ వార్నింగ్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను ఉద్యోగం నుంచి నీవు తీసి వేస్తే నేను నీ ఉద్యోగం తీసివేస్తానని వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు చేపట్టిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. వార్నింగ్ లతో ఏ జరగదు తమ్ముడు.. ముందు టీచర్లను ఎలా చూడాలో ముందు నీవు నేర్చుకో అని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు. అధికారంలో లేనప్పుడు రైతుల ధర్నా దగ్గరికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులకు బేడీలు వేస్తున్నాడని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టు కోవలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారని అన్నారు.

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే జీతాలతో లంచ్ మాట అటుంచితే బ్రేక్ ఫాస్ట్ రాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితులో ఉన్నాడని ఎద్దేవ చేశారు. రెగ్యులరైజ్ చేయని పక్షంలో కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకుందామని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు రెగ్యులర్ గా ఉండరని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు అప్పటికి రెగ్యులరైజ్ చేయని పక్షంలో ఆరు నెలల తర్వాత జమిలి ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో మీ సత్తా చాటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలను సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

జనవరి 19 లోపు రెగ్యులరైజ్ చేయని పక్షంలో హైదరాబాద్ లో ర్యాలీ ఏర్పాటు చేస్తా అన్నారు. గత ప్రభుత్వం కంటే అధికంగా ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష 30 వేల కోట్ల అప్పు చేశాడని అన్నారు. కేసీఆర్ కేటీఆర్ కవిత మీ డబ్బులు మీరు ఉంచుకోండి... నేను డబ్బులు తీసుకొచ్చి పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షల కోట్లు ప్రపంచవ్యాప్తంగా దానం చేసినట్లు తెలిపారు. సదాశివపేట మండలంలో 1200 ఎకరాల్లో ఛారిటీ ఏర్పాటు చేసి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story