- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంచలనాత్మక కథనాలను వెలికి తీస్తున్న దిశ
దిశ, ఏర్గట్ల : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా 'దిశ' దిన పత్రిక పనిచేస్తుందని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. రాము అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ ఠాణాలో సోమవారం ఆయన చేతుల మీదుగా 'దిశ' 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి రాజకీయ పార్టీలకు తలొగ్గకుండా నిజాలను నిర్భయంగా ఖచ్చితత్వంతో రాస్తూ, ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని, నిత్యం సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తూ..సమగ్రంగా వార్తలను ప్రజలకు చేరవేస్తూ.. స్పూర్తిని చాటి చెపుతున్న ఘనత 'దిశ' కు దక్కుతుందని అన్నారు. అత్యంత వేగంగా పాఠకులకు వార్తలను ఎప్పటికప్పుడు అందించడంతో..అనతి కాలంలోనే అనేకమంది పాఠకులను సొంతం చేసుకుని విశిష్ట ఆదరణ పొందిందన్నారు. పత్రిక ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు పత్రిక రంగంలో 'దిశ' సేవలు మరువలేనివన్నారు. ఈ పత్రిక మునుముందు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మరెందరో ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన దిశ పత్రిక యాజమాన్యానికి, పత్రిక నిర్వాహకులకు, పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రింట్ మీడియా విలేకరులు తదితరులు పాల్గొన్నారు.