చంద్రబాబు, రేవంత్ రెడ్డికి మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి కీలక రిక్వెస్ట్

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-06 12:49:49.0  )
చంద్రబాబు, రేవంత్ రెడ్డికి మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రులైన చంద్రబాబు(Chandrababu), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు బీజేపీ నేత, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు(Polavaram project) ఒక వరం అని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఎంత వేగంగా పూర్తి చేసుకుంటే రైతులకు, రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి స్టే తెచ్చినట్లు గుర్తుచేశారు. పోలవరంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు. వేగంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) సిద్ధంగా ఉందని గుర్తుచేశారు. అంతేకాదు.. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు కృష్ణా జలాలపై శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా.. వరద జలాల ఆధారంగా బనకచర్ల నిర్మిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వివరించారు. దీంతో సీఎం రేవంత్ తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేయాలని ఆదేశించారు. అదొక్కటే కాదు పోలవరం విషయంలోనూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తెలంగాణ రాష్ట్రంపై పడే ప్రభావాన్ని హైదరాబాద్ ఐఐటీకి చెందిన బృందంతో అధ్యయనం చేయించాలని ఆదేశించారు.

Advertisement

Next Story