- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తాగునీటి తండ్లాట.. నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

దిశ, రామడుగు : గత నాలుగు రోజుల నుంచి నల్లా నీళ్లు రాక తాగునీటి కోసం గ్రామాల ప్రజలు తండ్లాడుతున్నారు. రామడుగు మండల కేంద్రంలో గత వారం రోజుల నుంచి తాగునీరు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం తాగునీటి చర్యలు చేపట్టి ప్రజలకు నీరు అందించాలని కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన విషయం విధితమే. రామడుగు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సమస్యలు లేకుండా ప్రజలు పంచాయతీ సెక్రెటరీలు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి తాగు నీరు రాకపోవడంతో వేసవికాలంలో జనం తల్లడిల్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే చర్యలు చేపడతాం..: పంచాయతీ సెక్రటరీ అమర కొండ శ్రీనివాస్
మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి నీళ్లు రావడం లేదని, ప్రధాన రహదారి పక్కన పైపులైన్ లీకేజీ వల్ల మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. అది నేటితో ముగుస్తుండగా నీటి సరఫరా అందిస్తామని తెలిపారు. అదేవిధంగా నరసింగరావు చెరువులో ఉన్న మంచినీటి బావిలోని నీరు చెరువు నీటితో నిండిపోవడంతో కలుషితమైందని, వాటిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అపరిశుభ్రమైన నీటిని బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రపరచి ఆ తరువాత ప్రజలకు శుద్ధమైన నీరును అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.