- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోగికి వైద్యులు మెరుగైన సేవలు అందించాలి..: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
దిశ, నారాయణఖేడ్: ప్రతి రోగికి మెరుగైన సేవలు వైద్యులు అందించాలని, అప్పుడే వైద్యులకు మంచి గుర్తింపు వస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం లో గల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ లోఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్ లో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మనకు ఏ అవసరం ఉన్న మన తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మనకు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.
హాస్పిటల్ లో వైద్యలు ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అయినంతవరకు ఈ హాస్పిటల్లోనే వైద్యం అందించాలని ఒకవేళ ఇక్కడ కానీ యెడల వేరే హాస్పిటల్ లో ప్రైవేట్ హాస్పిటల్ లో గాని రిఫర్ చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హాస్పిటల్ వైద్య సిబ్బందిలతో కలిసి కేక్ కట్ ఎమ్మెల్యేకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ అశోక చక్రవర్తి, హాస్పిటల్ సూపరిండెంట్ జీ.రమేష్ , మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్,మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్,మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ,వివేకానంద కౌన్సిలర్, మండల అధ్యక్షుడు తాహేర్, మాజీ ఎంపీటీసీలు పండరి రెడ్డి ముంతాజ్ ,శంకర్ ముదిరాజ్,వెంకట్ రావు ,జ్ఞనోభారావు పాటిల్, దిల్ దర్ ఖాన్ సాబ్,అమృత్,అర్జున్ మాజీ ఎంపీటీసీ,నర్సింహులు, హాస్పిటల్ వైద్యుల బృందం హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.