జాతీయస్థాయి సైన్స్ ఫేర్ లో సింగరేణి పాఠశాలకు ప్రథమ బహుమతి

by Sridhar Babu |
జాతీయస్థాయి సైన్స్ ఫేర్ లో  సింగరేణి పాఠశాలకు ప్రథమ బహుమతి
X

దిశ, ఇల్లందు : హర్యానా రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఇల్లందు పట్టణానికి చెందిన సింగరేణి పాఠశాల విద్యార్థి ప్రథమ బహుమతి సాధించారు. టి.వరుణ్ కుమార్ అనే విద్యార్థి స్మార్ట్ అగ్రికల్చర్ రోబోతో విత్తనాలు నాటడం, నేల చదును చేసి అవసరమైన ఫెర్టిలైజర్ పిచికారీ గుర్తించి నీటి సాగుబడి తెలుసుకోవడం, నూతన వ్యవసాయ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభంతో ఉపయోగపడే వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికత టెక్నాలజీని రూపొందించినందుకు ప్రథమ బహుమతి లభించింది. సింగరేణి పాఠశాల నుండి పాల్గొన్న టి.వరుణ్ కుమార్ ను, దీనికి ప్రోత్సాహం ఇచ్చిన అటల్ థింకర్ ల్యాబ్ ఇన్చార్జ్, గైడ్ టీచర్ గా వ్యవహరించిన ఎం.విష్ణు ప్రియ, ఎస్కార్ట్ గా వెళ్లిన ఏ.శ్రీనివాసరావును ఇల్లందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story