Breaking News : లాలపేటలో దారుణం.. తల్లీ కొడుకుల ఆత్మహత్య

by M.Rajitha |   ( Updated:2025-01-04 12:12:21.0  )
Breaking News : లాలపేటలో దారుణం.. తల్లీ కొడుకుల ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని లాలపేట(Lalapeta)లో తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటం, రెండు రోజులుగా ఆ ఇంటి నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. తల్లీ కొడుకుల మృతదేహాలు ఉబ్బిపోయి కనిపించాయి. రెండు రోజుల క్రితం ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనారోగ్యంతో తల్లి మరణించగా.. దానిని జీర్ణించుకోలేని కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story