CM Revanth: హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ ప్రారంభం

by Gantepaka Srikanth |
CM Revanth: హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌(Greater Hyderabad)లోని రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. సోమవారం ఒవైసీ సోదరులతో కలిసి నెహ్రూ జూ పార్క్ నుంచి ఆరాంఘర్(Arangar - Zoo Park Flyover) వరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆరులేన్ల ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, పలువురు స్థానిక కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఈ రహదారి ఒకటి. నిత్యం ట్రాఫిక్ జామ్‌లు జరుగుంటాయి. ఇక వర్షం వస్తే ఎక్కడి వాహనాలు అక్కడే గంటల తరబడి నిలిచిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ రద్దీతో పాటు వర్షం వచ్చినప్పుడు పడే తిప్పలు తప్పుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు రూ.800 కోట్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు.

Advertisement

Next Story