RadhikaApte: పూరీ, విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. బంపర్ ఆఫర్ అందున్న క్రేజీ బ్యూటీ

by sudharani |
RadhikaApte: పూరీ, విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. బంపర్ ఆఫర్ అందున్న క్రేజీ బ్యూటీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Director Puri Jagannath), తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ టబు (Tabu) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్ (Charmi Kaur) నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అంటూ సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా పూరీ, విజయ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ యంగ్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte) ను ఫిక్స్ చేశారట మేకర్స్. అంతే కాకుండా.. స్టోరీ చెప్పగానే హీరోయిన్ కూడా ఓకే చేసిందని తెలుస్తుంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.



Next Story

Most Viewed