SSA: వినూత్న రీతిలో సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల నిరసనలు

by Ramesh Goud |
SSA: వినూత్న రీతిలో సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు(Sarva Siksha Abhiyan Employees) సమ్మె(Protest) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మెలో భాగంగా ఉద్యోగులు జిల్లాల్లో వినూత్న నిరసనలు(Innovative Protests) చేపడుతున్నారు. ఇటీవల ఓ ఉద్యోగి తెలంగాణ తల్లి(Telangana Thalli) రూపంలో నిరసన తెలపగా ఇవాళ మరికొందరు ఉద్యోగులు కొత్త తరహాలో ఆందోళనలు చేశారు. మహబూబాబాద్(Mahabubabad) పట్టణంలోని సర్వ శిక్షా ఉద్యోగులు తమను రెగ్యూలర్ చేయాలని మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేశారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించి తమ సమస్యలను వెంటనే తీర్చాలని మోకాళ్ల దీక్ష చేశారు. ఇదిలా ఉండగా నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagarkurnool district) ఉద్యోగులు మానవహారం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో మానవహారంతో ఎస్ఎస్ఏ(SSA) ఆకారంలో కూర్చోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎస్ఎస్ఏ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యూలర్ ఉద్యోగులుగా ప్రకటించాలని, అంతేగాక ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed