Minister Seethakka: మంత్రి సీతక్కతో కమెడియన్ అలీ భేటీ

by Ramesh N |   ( Updated:2025-01-04 16:06:12.0  )
Minister Seethakka: మంత్రి సీతక్కతో కమెడియన్ అలీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి సీతక్క(Minister Seethakka)తో ప్రముఖ టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ (Actor Ali) సమావేశం అయ్యారు. ఇవాళ సచివాలయంలో మంత్రి పేషీలో సీతక్కతో సినీ నటుడు అలీ, డైరెక్టర్ రమణారెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సామాజిక బాధ్యతతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తాను చిత్రీకరించిన ‘నిన్ను నన్ను కన్నది ఆడది రా’ అనే పాట ఆవిష్కరణకు మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా అలీ ఆహ్వానించారు. ఆ పాట వీడియోను తన ట్యాబ్‌లో సీతక్కకు చూపించారు.

ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ నెల 8 న సాయంత్రం పాట ఆవిష్కరణ ఉంటుందని అలీ పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పాట రూపొందించిన అలీని శాలువాతో సీతక్క సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Read More...

Bollywood News : ఆసుపత్రిలో చేరిన 'గేమ్ ఛేంజర్' బ్యూటీ?


Advertisement

Next Story