రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

by srinivas |   ( Updated:2021-01-22 22:00:23.0  )
రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. రైల్వేట్రాక్‌ దాటుతుండగా యువకులపై రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాప్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story