- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా జీవితంలో మరిచిపోలేని రోజు: కీర్తి సురేష్
మహానటి సావిత్రి.. తన జీవితం తెరిచిన పుస్తకం. అయినా ఆ పుస్తకంలో తెలియని మలుపులు.. ఆ జీవితంలో ఎంతో ఆరాటం.. పట్టువదలని దీక్ష.. అంతుపట్టని బాధ, అంతులేని దానగుణం, అంతకు మించిన నటనా ప్రస్థానం ఉందని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కీర్తి సురేష్ ను మహానటి గా ఎంచుకుని.. తనరూపంలో సావిత్రిని కళ్ళముందు సాక్షాత్కరింప చేశాడు. అవును.. కీర్తి కీర్తి కాదు.. సావిత్రిగా మారిపోయింది. తెరపై సావిత్రిగా జీవించింది. బాధ, కోపం, చిరునవ్వు, పట్టుదల అన్ని ఎమోషన్స్ ను సావిత్రిలాగే కళ్లతో పలికించింది. నిజానికి తను మహానటి సావిత్రిని మరిపించింది. నేనే మీ మహానటి సావిత్రిని అనేలా ఆ పాత్రకు ప్రాణం పోసింది.
సినిమా విడుదల తర్వాత భారత సినీ ప్రముఖులచే కీర్తించబడిన కీర్తి.. ఈ సినిమాకు నేషనల్ అవార్డు అందుకుంది. కాగా చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. మహానటి సినిమా గురించి ట్వీట్ చేసింది కీర్తి.
మే 9, 2018.. నా జ్ఞాపకాల నుంచి చేరిపేయలేని రోజు.. నా జీవితాన్ని మార్చిన రోజు.. ఇది జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఆ రోజు జరిగిన ప్రతి బిట్ ను ఇంకా ఆస్వాదించగలుగుతున్న అని తెలిపింది కీర్తి. ధన్యవాదాలు సావిత్రమ్మ అని ఆనాటి మహానటి.. ఈ నాటి మహానటికి కృతజ్ఞతలు తెలిపింది. కొన్ని సినిమాల గురించి చెప్పేందుకు పదాలు అవసరం లేదు. ఈ రెండేళ్లకు నేను చెప్పే రెండు పదాలు “Thank You”.