ఏకాంతంగా గడుపుతున్న జంటపై కత్తిపోట్లు..

by Sumithra |
Sword attack
X

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణానది పుష్కరఘాట్ల వద్ద ఏకాంతంగా ఉన్న జంటపై దాడి చేసి అత్యాచారం చేసిన ఘటన మరవక ముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. సోమవారం ఏకాంతంగా గడుపుతున్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషయంగా ఉన్నది. పోలీసులు కథనం ప్రకారం..

నిజాంపట్నం మండలం పాలెం గుణంవారిపాలెం గ్రామంలో బొర్రా పున్నమ్మ(32), అద్దంకి బాలయ్య కలిసి ఏకాంతంగా గడుపుతున్నారు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఇద్దరిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. వారి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన పున్నమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా.., బాలయ్య పరిస్థితి విషమంగా ఉన్నది. కాగా, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

Next Story