షాకింగ్: ఓల్డ్ సిటీలో అక్కాచెల్లెళ్లు ఏమయ్యారు..?

by Anukaran |   ( Updated:2021-08-14 09:05:36.0  )
షాకింగ్: ఓల్డ్ సిటీలో అక్కాచెల్లెళ్లు ఏమయ్యారు..?
X

దిశ, చార్మినార్ : అక్కా చెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. అందులో చెల్లెలు మైనర్ ​బాలిక కావడం కుటుంబీకులను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. చాంద్రాయణగుట్ట ఏఎస్ఐ కే సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ నూరినగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు మహ్మద్ అజామ్ వృత్తి రీత్యా పెయింటర్. పెద్దకూతురు సమ్రీన్​ బేగం(19), చిన్నకూతురు సారాబేగం(17)లు శుక్రవారం ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో అప్రమత్తమైన కుటుంబీకులు.. చుట్టు పక్కల ఇండ్లు, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సోదరుడు మహ్మద్ అజామ్ ​శుక్రవారం చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో సికింద్రాబాద్‌కు చెందిన అథాస్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశాడు. మహ్మద్ అజామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story