నిజామాబాద్‌లో ఇద్దరు ఆత్మహత్య

by Shyam |
నిజామాబాద్‌లో ఇద్దరు ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్: జిల్లా కేద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దురు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఒకరు ఆర్ ఎస్‌ఐ భార్య కాగా, మరొకరు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలు బుధవారం జరుగుగా ఆలస్యంగా వెలుగు చూశాయి. కామారెడ్డి జిల్లాలో రిజర్వ్ ఎస్ఐ సతీమణి పిరుబాయీ (45) నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేందుకు యత్నించగా పోలీసులకు సమాచారం అందటంతో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మరో ఘటనలో నాల్గవ టౌన్ పరిధిలో వినాయక్ నగర్‌లోని ఫస్ట్ లేడీ మేయర్ స్ట్రీట్‌లో నివాసం ఉండే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ మురళి(45) బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్ కు పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు యత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందారు. అయితే కుటుంబ సభ్యులు గుండెపోటుతో చనిపోయారు అని సర్టిఫికెట్ కోసం డాక్టర్ల ఒత్తిడి తేవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement

Next Story