Black Fungus: బ్లాక్ ఫంగస్ అటాక్.. నవీపేట్‌లో మరో ఇద్దరు మృతి

by Sumithra |   ( Updated:2021-05-24 05:04:58.0  )
Black Fungus: బ్లాక్ ఫంగస్ అటాక్.. నవీపేట్‌లో మరో ఇద్దరు మృతి
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో ఇద్దరు బ్లాక్ ఫంగస్ సోకి మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన మేకల పద్మ(55)కు కాళ్ల వాపులు రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. డాక్టర్లు హైదారాబాద్‌కు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. బాధితురాలు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో తిరిగి ఇంటి బాట పట్టారు. విషయం తెలిసిన నవీపేట్ ఎంపీడీవో సాజద్ ఆలీ, వైద్య సిబ్బంది వారి ఇంటికి వెల్లి వారి వివరాలు సేకరించారు. హైదారాబాద్ ఆస్పత్రికి తరలించేందుకు వాహనం సిద్ధం చేశామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయినా కాని కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే పద్మ ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచింది. ఇదే ఏరియాకు చెందిన మరో వ్యక్తి బేగం ఎల్లయ్య(62)నేత్రాల్లో వాపులు రావడంతో జిల్లా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళారు. అక్కడ బ్లాక్ ఫంగస్‌గా గుర్తించిన వైద్యులు. తక్షణమే హైదారాబాద్‌కు తరలించారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఎల్లయ్య కూడా మరణించాడు.

Advertisement

Next Story