- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్టు
దిశ, వాజేడు: మావోయిస్టు కొరియర్‌గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏటూరు నాగారం ఏస్పీ ఆలం గౌస్ వివరాల ప్రకారం…మావోయిస్టు అగ్రనేతల ఆదేశాల మేరకు చెలిమెల, జెల్ల, పామునూరు గ్రామాలకు చెందిన కొందరు మిలీషియా సభ్యులు… కూంబింగ్ నిర్వహించే పోలీసులను చంపాలని కుట్రపన్నారు. ఈ మేరకు చెలిమెల అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలను వారు అమరుస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు చెలిమెల అడవిలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు మిలీషియా సభ్యులు బాంబులు అమరుస్తూ తారసపడ్డారు. కాగా పోలీసులను చూసి మిలీషియా సభ్యులు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబండించి వారిలో ఇద్దరు మిలిషియా సభ్యులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసకున్నారు.
కాగా అరెస్టైన వారిని చెలిమెల గ్రామానికి చెందిన సోడి కోస అలియాస్ మూడ (45), వెంకటాపురం గ్రామానికి చెందిన పోడియం మూడాలు ( 40)గా గుర్తించారు. 2018లో మావోయిస్టుల సానుభూతిపరులుగా చేరి మావోలకు సహాయపడుతూ ఉండేవారు. 2019 నుంచి ప్రభుత్వ నిషేదిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ సెక్రటరీ సుధాకర్ ఆదేశాల మేరకు చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారు.