ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

by srinivas |
ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి
X

దిశ, నల్లగొండ: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మ‌ృతులు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ కారును ఆయన బంధువులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో మహిళ పేరు కొల్లపూడి ధనలక్ష్మి కాగా, మరొకరి పేరు తెలియాల్సి ఉంది. గాయపడిన వ్యక్తి పేరు పెండ్యాల సాయి సందీప్‌గా గుర్తించారు.

Tags: road accident, hyd, vijayawada, national highway, car,tractor, suryapet, guntur, munagala

Advertisement

Next Story